యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రధానాలయం వద్ద రథశాలను సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయానికి ఉత్తర దిశలోని మాఢ వీధిలో నిర్మితమవుతోన్న రథశాలకు మూడు వైపుల ఆధ్యాత్మిక చిహ్నాలతో కూడిన రూపాలు పొందుపరుస్తున్నారు. పడమటి దిశలో శంఖుచక్ర నామాలు, మరోవైపు స్వామి రథనమూనాను సిద్ధం చేస్తున్నారు.
కొండపై అతిథి గృహం, ఈవో ఛాంబర్ భవనాలకు తారురోడ్డు పనులను చేపట్టారు. సదరు భవనాలకు రాక పోకలు సాగించేందుకు 120 మీటర్ల పొడవు,7.5 మీటర్ల వెడల్పుతో తారురోడ్డు పనులు చేపట్టినట్లు యాడా అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: Asaduddin: మరోసారి లాక్డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్