యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కేంద్రం స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాంపల్లి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకులు విద్యార్థిని శ్రావణి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం చేపట్టి సంతాపం ప్రకటించారు. 24గంటలలోపు నిందితులను అదుపులో తీసుకుంటామని కమిషనర్ మహేశ్ భగవత్ హామీ ఇచ్చినప్పటికీ... ఇంత వరకు ఆచూకీ కనుక్కోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో ప్రాదేశిక ఎన్నికలకు గుర్తులు కేటాయింపు