యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని గుండ్లపల్లి వాగు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్ల యజమాని గుండ్లపల్లి భరత్‌తో పాటు ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు... ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం