ETV Bharat / state

weavers problems : ప్రభుత్వానికి పట్టని నేతన్న కష్టం.. చేయూత కోరుతున్న కార్మికలోకం - yadadri weavers problems

ప్రపంచ మానవాళికి బట్టకట్టి నాగరికతను నేర్పిన చేనేత చేయి(weavers problems) విరిగింది. సాలీల మగ్గం సడుగులిరిగింది. ఎంతో నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న చేనేత కార్మికుడి జీవనం కష్టంగా మారింది. కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలంగా చేనేత కార్మికులు జీవన పోరాటంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. వస్త్ర ప్రపంచంలోకి బహుళజాతి సంస్థల రాకతో చేనేత కాసింత వెనక పడ్డట్టు కనిపిస్తున్నా, తనకు ఉన్న.. ఓర్పు, నేర్పుతో కష్టాలను అధిగమించి తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నేతన్నల కష్టాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...

ప్రభుత్వానికి పట్టని నేతన్న కష్టం
ప్రభుత్వానికి పట్టని నేతన్న కష్టం
author img

By

Published : Aug 3, 2021, 3:03 PM IST

అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసి ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్​కు బహుమానంగా పంపించిన చరిత్ర మన నేతన్నల(weavers problems)ది. ఎన్నో రంగురంగుల డిజైన్లతో చీరను నేసిన నేతన్న, తమ బతుకులకు మాత్రం రంగులద్దలేక పోతున్నాడు. ఆర్థిక అసంతృప్తి వెనక్కు లాగుతున్నా.. పని ఇచ్చే సంతృప్తి ముందు ఏదీ సాటిరాదంటూ సాగిపోతున్నాడు. కానీ.. అతడి మీద ఆధారపడిన కుటుంబం మాత్రం అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. వస్త్ర ప్రపంచంలో ఎంత పురోగతి ఉన్నా.. ఎన్ని బహుళజాతి సంస్థలు వచ్చినా.. నేతన్న అన్నింటిని అధిగమించి.. తానేంటో నిరూపించుకుంటున్నాడు. కానీ.. ఆర్థికంగా మాత్రం ఎంతో కుంగిపోతున్నాడు. వస్త్ర రంగంలో.. తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న చేనేత కార్మికులకు చేయందించి అక్కున చేర్చుకునే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు.

భువనగిరిలో అత్యధిక చేనేత కార్మికులు

తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే అత్యధికంగా చేనేత మగ్గాలు(weavers problems)న్నాయి. ముఖ్యంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 1550 మగ్గాలున్నాయి. వలిగొండ, చౌటుప్పల్, రామన్నపేట, చండూరు, రాజపేట, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొయ్యలగూడెం, సిరిపురం, కుంట్లగూడెం, ఎల్లంకి, బోగారం, గౌరాయిపల్లి, గట్టుప్పల్ గ్రామాల్లో కూడా చేనేతను నమ్ముకుని చాలా కుటుంబాలు ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,294 మగ్గాలకు శాశ్వత జియో ట్యాగింగ్​, 536 మగ్గాలకు తాత్కాలిక జియో ట్యాగింగ్​లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 17,830 మంది చేనేత.. దాని అనుబంధ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నూలు సబ్సిడీ 40 శాతం కింద 10,006 మంది చేనేత కార్మికులకు 4 కోట్ల 90 లక్షల రూపాయలు విడుదల చెసినట్లు అధికారులు చెబుతున్నారు. ముద్ర లోన్ యోజన కింద జిల్లాలో 228 మంది చేనేత కార్మికులకు కోటి 14 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లు , రుణ మాఫీ కింద 2,420 మంది చేనేత కళాకారులకు లబ్ది చేకూరిందని వెల్లడించారు.

రూ.500 కూలీ కూడా వస్తలేదు..

మరోవైపు.. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందరికి అందటం లేదని చేనేత కార్మికులు(weavers problems) వాపోతున్నారు. ఎంత కష్టపడ్డా రోజు కూలీ ఐదు వందలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా భర్తలిద్దరు పని చేసినా.. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. తమ పిల్లల్ని ఈ రంగంలోకి రాకుండా ఉపాధి కోసం మరో రంగంలోకి పంపుతున్నామని చెబుతున్నారు. చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు, బీమా సౌకర్యం, పనికి మద్దతు ధర కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

2014 నుంచి 30 మంది ఆత్మహత్యలు

జిల్లాలో 2014 నుంచి సుమారు 30 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేతన్నలు అంటుండగా.. జిల్లా అధికారులు మాత్రం 15 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర చొప్పున పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. సర్కార్ నుంచి ఇంకా జిల్లాకు సమాచారం రాలేదని వెల్లడించారు.

ఏళ్లు గడిచినా..

మరోవైపు.. చేనేత కార్మికులు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందలేదని వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి యజమాని మరణంతో.. తాము రోడ్డున పడుతున్నామని వాపోతున్నారు. పిల్లల చదువు మాన్పించి పనుల్లోకి పంపాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు పనికి పోతున్నారు..

మా ఆయన పేరు వెంకటేశ్. ఆయన చిన్నతనం నుంచి చేనేత రంగంలోనే ఉన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. నేను.. నా ఇద్దరు పిల్లలు.. మా అత్తమ్మ ఒంటరివాళ్లమయ్యాం. ఇప్పుడు మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారింది. నా కొడుకులిద్దరు చదువు మానేశారు. ఒకరు వస్త్రదుకాణంలో పని చేస్తున్నారు. ఇంకో కుమారుడు ఇక్కడి స్థానిక కంపెనీలో పనికి కుదిరాడు. నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. పరిహారం కోసమని రెండేళ్ల క్రితం దరఖాస్తు చేశాను. ఇప్పటి వరకు పరిహారం అందలేదు. కనీసం నాకు వితంతు పింఛను కూడా రావడం లేదు. మా లాంటి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి.

- లక్ష్మి, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి భార్య

అందరు పని చేసినా.. పోషణ కష్టమే..

రోజుకు 12 గంటలు పనిచేసినా.. రూ.500 కూడా రావడం లేదు. భార్యా పిల్లలతో కలిసి అందరు పని చేస్తున్నా.. కుటుంబ పోషణ సాధ్యం కావడం లేదు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే కూలీ కూడా చేనేత కార్మికులకు రావడం లేదు. చేనేత కార్మికుల ఆరోగ్యం గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్న ఆరోగ్య కార్డులను కూడా ఇప్పుడు నిలిపివేశారు. చేనేత కార్మికుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. మా అభివృద్ధికి కాస్త సాయం చేయాలి.

- గర్దసు నర్సింహ, చేనేత కార్మికుడు

పరిహారమేది..?

2014 నుంచి 30 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 16 మంది బలవన్మరణాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ 16 మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. కార్మికుడి మీదే ఆధారపడిన ఆ కుటుంబాలు.. ఇప్పుడు రోడ్డున పడ్డాయి. వారి పిల్లలు చదువు మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారికి రావాల్సిన పరిహారాన్ని అందజేయాలి.

- చింతకింది రమేశ్, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, భూదాన్ పోచంపల్లి

ప్రస్తుత పరిస్థితుల్లో చేనేతకు చేయూత ఆనందించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికునికి ఆర్థిక పరిపుష్టిని అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే, నేతన్న అద్భుతాలు సృష్టిస్తాడు అనడంలో సందేహం లేదని పలువురు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.