యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 73 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా... వారిలో 26 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కాగా వారం కిందట కరోనా సోకిన మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ... సోమవారం మృతి చెందినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.
ప్రజలు నిబంధనలను పాటించక పోవడమే కరోనా వ్యాప్తికి కారణమవుతోందని ఆయన అన్నారు. ఇదే మరణాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందాలని... బయట తిరగడం వల్ల వైరస్ వ్యాప్తికి కారకులు అవుతున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ