ETV Bharat / state

యాదాద్రి జిల్లా కలెక్టర్‌ బదిలీ.. ఆ స్థానంలో పమేలా సత్పథి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌(anita ramachandran) బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆమెను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు(government orders) జారీ చేసింది. ఆమె స్థానంలో ప్రస్తుతం వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పమేలా సత్పథి బదిలీపై ఇక్కడికి రానున్నారు.

yadadri bhongir district collector
యాదాద్రి జిల్లా కలెక్టర్‌ బదిలీ.. ఆ స్థానంలో పమోలా సత్పతి
author img

By

Published : Jun 14, 2021, 7:00 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఆమె స్థానంలో వరంగల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పథిని (pamela satpathy) జిల్లా కలెక్టర్‌గా (yadadri bhuvanagiri district collector ) నియమించింది.

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌(cm kcr) పల్లె, పట్టణప్రగతిలపై అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశం అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అనితారామచంద్రన్‌కు మళ్లీ పోస్టింగు ఇవ్వలేదు. మరోవైపు వరంగల్‌ నగరపాలక సంస్థకు కొత్త కమిషనర్‌ను నియమించలేదు.

గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌గా ఏడాదిన్నరపాటు పనిచేసిన పమేలా సత్పథి ఓరుగల్లు నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. 2019 డిసెంబరు 24న ఆమె ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. కూడళ్లకు కొత్త కళ తీసుకొచ్చారు. స్మార్ట్‌సిటీ, సీఎం హామీల పథకం, పట్టణ ప్రగతి, తదితర అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. జాతీయ స్థాయిలో వరంగల్‌కు పేరు వచ్చేలా పనులు చేశారు. వరంగల్‌ నగరంపై తనదైన ముద్ర వేశారు. స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతం చేశారు.

  • పమేలా సత్పథి 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌, నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించారు. దేశ వ్యాప్తంగా 51వ ర్యాంకు. ఆమె రచయిత, ప్రకృతి ప్రేమికురాలు, కళాకారిణి కూడా.
  • భర్త పేరు: డాక్టర్‌ దీపాంకర్‌
  • తండ్రి పేరు: ఆర్కే సత్పథి, డీఆర్డీవోలో పనిచేశారు.
  • స్వస్థలం: ఒడిశా రాష్ట్రం, కొరపుట్‌ జిల్లా, సునబెది
  • విద్యార్హతలు: బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు భువనేశ్వర్‌లో చేశారు. సోషియాలజీ, హ్యూమన్‌ రైట్స్‌లో పీజీ చేశారు. ఐఏఎస్‌కు ఎంపిక కాక ముందు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)లో శాస్త్రవేత్తగా పనిచేశారు. కొంత కాలం పాటు ఇన్పోసిస్‌లో ఉద్యోగం చేశారు.

ఇదీ చూడండి: CM KCR: పల్లెలు, పట్టణ ప్రగతే లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.