యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవలంబించాల్సిన విధానాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ఓహొటల్లో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జి బిర్ల ఐలయ్య, జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించలేదని.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో తహసీల్దార్ల బదిలీలు