![yadadri](https://editlite.s3.ap-south-1.amazonaws.com/11:39_tg-nlg-82-01-balayam-pechulu-udinavi-av-ts10134_01062020104813_0106f_1590988693_922.jpg)
యాదగిరిగుట్టలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని పైకప్పు పెచ్చులూడింది. రెండు చోట్ల పెచ్చులూడి కింద పడగా... ప్రమాద సమయంలో ఎవ్వరూలేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. గతంలోనూ బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది.
యాదాద్రి ప్రధానాలయాన్ని పునర్ నిర్మిస్తున్న క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా... బాలాలయాన్ని రెండేళ్లపాటు నిలిచేలా కట్టారు. ఆలయ పునర్నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తికాకపోవటం వల్ల ఇప్పటికీ స్వామివారి నిత్యకైంకర్యాలు, దర్శనాలు బాలాలయంలోనే జరుగుతున్నాయి.