యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రాజగోపురాలపై కళశాలు, దివ్యవిమానంపై సుదర్శన చక్రం, ప్రధానాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠాల తొడుగులకు స్వర్ణ తాపడం పనులను యాడా అధికారులు చెన్నైలో చేపట్టారు.
అక్కడి స్మార్ట్ క్రియేషన్స్ ఇండస్ట్రీలో చేపడుతున్న బంగారు పనులను పరిశీలించేందుకు యాడా బృందం చెన్నై వెళ్లింది. మూలవర్యులకు సైతం తాపడం చేపట్టాలని, గతంలో ఉన్న బంగారు తొడుగులకు మెరుగులు దిద్దాలని యాడా యోచిస్తోంది.
- ఇదీ చూడండి: సరకు రవాణాకు.. సిద్ధం కాబోతున్న ఆర్టీసీ బస్సులు