యాదాద్రి సందర్శనకు వచ్చే పేద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లకు యాడా కృషి చేస్తోంది. ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న క్షేత్రాభివృద్దిలో మరెక్కడా లేని తరహాలో కొండపై ఆలయాలు పునర్ నిర్మితమవుతున్నాయి.
కొండకింద గతంలో ఉన్న గోశాల ప్రాంగణంలో భక్తుల బ్యాగుల భద్రతతో పాటు వారు సేద తీరేలా రెండు డార్మిటరీ హాళ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 200 మంది వరకు సామాన్లతో ఉండేలా తాత్కాలిక బసకు ఏర్పాట్లు అయ్యాయని ప్రాధికార సంస్థ నిర్వాహకులు చెప్పారు.
రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇందులో స్నానం గదులు, మరుగుదొడ్లు, వంటశాల సౌకర్యాలు ఉంటాయన్నారు. పనులు త్వరలోనే పూర్తవుతాయని, దేవస్థానం సివిల్ విభాగం పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ఇదీ చూడండి: అమెరికా, బ్రిటన్కు తెలంగాణ సోనా రకం బియ్యం: కేటీఆర్