ETV Bharat / state

యాదాద్రిలో లక్ష పుష్పార్చన పూజలు - తెలంగాణ వార్తలు

ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు జరిగాయి. శాస్త్రోక్తంగా స్వామివారికి వేదపండితులు పూజలు నిర్వహించారు.

Worship in Yadadri temple
Worship in Yadadri temple
author img

By

Published : Jun 6, 2021, 6:16 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా అంతరంగికంగా జరిగాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిత్య పూజలను స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవలో నిర్వహిస్తున్నారు.

స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం.

కొవిడ్ బారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలతోపాటు సుదర్శన నారసింహ హోమం నిర్వహించి వేడుకున్నామని ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.

ఇదీ చూడండి. Petrol Price hike: భగ్గుమంటోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.