యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం బోయిన్ పల్లి గ్రామానికి చెందిన యువతిని అదే మండలం కేకే తండాకు చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడని బాధితురాలు తెలిపింది. తనను లోబరుచుకుని చివరకు గర్భవతిని చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుందామని అడిగితే బుకాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
గ్రామస్థుల మద్దతుతో కుటుంబసభ్యులతో కలిసి బొమ్మలరామారంలోని గుడిబావి చౌరస్తా వద్ద బైఠాయించి ధర్నా చేపట్టింది. ఇప్పుడు తను నాలుగు నెలల గర్భవతిని అని.. తనకు న్యాయం చేయాలని కోరింది. తనను పెళ్లి చేసుకునేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించాడని వాపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తామని నచ్చజెప్పారు. దీంతో ధర్నా విరమించారు.
ఇదీ చదవండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్