కడుపునొప్పి తట్టుకోలేక మహిళ తన ఇంటి ముందు గల చెట్టుకు ఉరేసుకొని మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(యం) మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగింది. తిమ్మాపురంలో నివాసం ఉంటున్న శ్యామల వెంకటమ్మ(48) భర్త యాకయ్య గతించడంతో ఒంటరిగా జీవిస్తోంది. గత సంవత్సరకాలం నుంచి శరీరం మంటలు మండుట, కడుపునొప్పి అధికంగా ఉండడం వల్ల ఆస్పత్రిలో చూపించినా ఆరోగ్యం మెరుగుపడలేదు.
సోమవారం రాత్రి కడుపునొప్పి తీవ్రం కావడం వల్ల తన ఇంటి ముందు గల టేకు చెట్టుకు చీరతో ఉరేసుకొని బలవన్మరణం పొందింది.
మరుసటి రోజు ఉదయం పాలు పోయడానికి వచ్చిన తిమ్మాపురం గ్రామస్థుడు చూసి, మృతురాలి కొడుకు శ్యామల బాబుకు చరవాణి ద్వారా సమాచారం అందించాడు. మృతురాలి కొడుకు శ్యామల బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: మతిస్థిమితం కోల్పోయి జలాశయంలో పడి మహిళ మృతి