యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఆరెస్సెస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 157వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
స్వామి వివేకానంద మహా జ్ఞాని, ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని తెలియపరిచిన ఏకైక వ్యక్తి అని కార్యకర్తలు కొనియాడారు. యువత ఆయన అడుగు జాడల్లో నడిచి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఇవీ చూడండి : 'హామీలు నెరవేర్చని తెరాసకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది'