రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఆర్థికసాయం అందించారు గ్రామస్థులు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామానికి చెందిన గద్దగూటి సంతోశ్(30) ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆసరాగా ఉన్న వ్యక్తి ఆకాల మరణం ఆ కుటుంబంలో తీవ్ర వేదనను మిగిల్చింది.
ఈ నెల 26న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతిచెందాడు. అతనికి వికలాంగురాలైన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామస్థులు, తెరాస కార్యకర్తలు రూ.25 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.