యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోనాల ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల జాతర కన్నుల పండువగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. డప్పు చప్పుల్లు, శివసత్తుల నృత్యాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి : శ్రావణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం