యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరుద్యోగులు మౌనదీక్ష నిర్వహించారు. పురపాలక సంఘంలో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నియామకాలు చేపట్టినందకు నిరసనగా ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ ఛైర్మన్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ ఆమోదం తెలపకముందే ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు.
ఈ విషయమై ఛైర్మన్‌ను వివరణ అడగ్గా మూడు రోజుల క్రితమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎనిమిది మందితో కూడిన కౌన్సిల్ సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగులను కౌన్సిల్ ఆమోదం ద్వారానే నియమకం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.