Bus Accident: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో టీఎస్ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. రంగాపురం సమీపంలోని ఎయిమ్స్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరు గాయపడలేదని పోలీసులు పేర్కొన్నారు . అయితే ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుందని చెప్పారు. ఆసమయంలో బస్సులో 36మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: Rajagopal reddy on Revanth : 'కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా..?'
సైకిల్‌పై వెళ్తూ డ్రైనేజీలో పడ్డ బాలిక.. 2 గంటల రెస్క్యూ ఆపరేషన్.. చివరకు...