ETV Bharat / state

గులాబీ మయమైన భువనగిరి - లోక్​సభ

భువనగిరి లోక్​సభ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు తెరాస కసరత్తు ప్రారంభించింది. పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ హాజరై శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభాస్థలికి చేరుకుని కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

సభావేదిక
author img

By

Published : Mar 7, 2019, 1:32 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకునేందుకు తెరాస సిద్ధమైంది. పార్లమెంట్​ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ భువనగిరి లోక్​సభ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
20 ఎకరాల ప్రాంగణం
నల్గొండ దారిలోని తుక్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశానికి 20 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగాం, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ నుంచి నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. సభ వద్ద మహిళలు, పురుషులకు వేరువేరుగా ఏర్పాట్లు చేశారు.

భారీ ఏర్పాట్లు..

కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారి భువనగిరి వస్తున్న కేటీఆర్​కు బ్రహ్మరథం పట్టేందుకు జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ జెండాలతో రోడ్లు నిండిపోయాయి. వరంగల్​ నుంచి కేటీఆర్​ మధ్యాహ్నం భువనగిరి చేరుకోనున్నారు.

ఇవీ చూడండి:జోరుగా తెరాస సమావేశాలు

గులాబీ మయమైన భువనగిరి

TG_NLG_03_07_TRS_Meeting_PKG_R14 Reporter: I.Jayaprakash Centre: Nalgonda నోట్: మోజో నుంచి TG_NLG_62_06, TG_NLG_62_07 ఫైళ్ల ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. --------------------------------------------- ( ) భువనగిరి లోక్ సభ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేసేందుకు... తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టిసారించింది. వరుసగా రెండోసారి గులాబీ జెండా రెపరెపలాడించాలన్న లక్ష్యంతో... ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఏడు శాసనసభ నియోజకవర్గాలకుగాను... అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ హవానే కొనసాగుతోంది. ........................LOOK Vo ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకునేందుకు... తెరాస కసరత్తు ప్రారంభించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు... పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... ఇవాళ మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. నల్గొండ దారిలోని తుక్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశానికి... 20 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో... భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగాం, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక స్థానాల్లో... అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారు. అయితే పార్లమెంటు పరిధి చూస్తే మాత్రం... ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి పోటీదారుగానే ఉంది. ప్రస్తుత ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ ఉండగా... వరుసగా రెండోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ............SPOT Vo సభ వేదికతో పాటు... మహిళలు, పురుషులకు వేరువేరుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారి భువనగిరి వస్తున్న కేటీఆర్ కు... బ్రహ్మరథం పట్టేందుకు జిల్లా నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. మధ్యాహ్నం తర్వాత వరంగల్ నుంచి భువనగిరి చేరుకోనున్న ఆయనకు... ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలేరు లో ఎమ్మెల్యే గొంగిడి సునీత... భువనగిరి మండలం జమ్మాపూర్ వద్ద స్థానిక శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి... ద్విచక్ర వాహనాల ర్యాలీతో కేటీఆర్ కు స్వాగతం పలకనున్నారు. అటు ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో... మొన్న జరిగిన ఎన్నికల్లో ఐదింటిలో అధికార పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు అదే ఊపును పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.