ETV Bharat / state

పేదల మనిషి సీఎం కేసీఆర్: మందుల సామేల్

యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మారం గ్రామంలో తెరాస ఆవిర్బావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ మందుల సామేల్ తన ఇంటిపై గులాబీ జెండాను ఎగరవేశారు. తెలంగాణ సాధనకు కృషి చేసిన కార్యకర్తలను సన్మానించారు.

trs farmation day, dharmaram, yadadri bhuvanagiri

author img

By

Published : Apr 27, 2021, 7:26 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ మందుల సామేల్ తన ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేశారు. తెలంగాణ సాధనకు అహర్నిశలు పోరాడిన పార్టీ కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో జరిగింది.

కేసీఆర్ నాయకత్వంలో స్వంత రాష్టం కోసం తెరాస 14 సంవత్సరాలు పోరాటం చేసిందని సామేల్​ అన్నారు. గడిచిన ఏడేళ్లలో పేదల మనిషిగా సీఎం కేసీఆర్​ ప్రజల మనస్సులను చూరగొన్నారన్నారు. కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని సూచించారు.

పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం నిరాడంబరంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆనాటి యోధులను సన్మానించుకోవడం తమకు గర్వంగా ఉందన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.