యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో రాజకీయ దురంధురుడు, ఉత్తమ పార్లమెంట్ మెంబర్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. గతంలో మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నపుడు మోత్కూరు ప్రజలను ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేశారని.. అప్పటి విషయాలను నాయకులు స్మరించుకున్నారు.
ఇవీ చూడండి : జగిత్యాల జిల్లాలో.. వెన్నలగండి పర్యాటకం