తెలంగాణ వచ్చాక కుమ్మరుల జీవితంలో వెలుగులు నిండాయని, కుమ్మరులు తమ వృత్తి నైపుణ్యాలను ఇంకా పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభార్ సశక్తికరణ్ కార్యక్రమంలో భాగంగా కుమ్మరులకు విద్యుత్ సారెలను పంపిణీ చేశారు. సుమారు 25 మంది యువకులకు 30 రోజులు శిక్షణ ఇచ్చి... వారికి పరికరాలు అందజేశారు.
కుమ్మరులకు ఉపయోగపడే అధునాతన పరికరాలు మార్కెట్లోకి చాలా వస్తున్నాయని ఆయన అన్నారు. వాటిని వినియోగించుకొని కొత్త డిజైన్లలో కుండలను తయారు చేసి... కుమ్మరులు ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: అవగాహన లోపం.. కొత్త కోర్సులకు దూరం!