ETV Bharat / state

దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఢీకొట్టిన రైలు

దైవదర్శనం చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో దంపతులను గూడ్స్​ రైలు కబళించింది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని భర్త అక్కడికక్కడే మృతి చెందగా... భార్య తీవ్ర గాయాలపాలైంది.

TRAIN ACCIDENT AT RAYADHURGAM RAILWAY STATION HUSBAND DIED, WIFE INJURED
author img

By

Published : Nov 23, 2019, 8:58 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్​లో విషాదం జరిగింది. జనగాంకు చెందిన రాంరెడ్డి, రాధ దంపతులు యాదాద్రి నర్సింహస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కోసం రాయగిరి రైల్వేస్టేషన్​లో ఎదురుచూస్తున్నారు. నిర్మాణంలోఉన్న ఫ్లాట్​ఫాం అంచున దంపతులు కూర్చున్నారు. అదే సమయంలో భువనగిరి నుంచి ఆలేరుకు గూడ్స్​ రైలు వెళ్తోంది. ప్రమాదవశాత్తు దంపతులిద్దరిని రైలు ఢీకొంది. ఈ ఘటనలో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధకు తీవ్రగాయాలయ్యాయి.

ప్రయాణికులు సమాచారం అందించగా... 108 సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. రాధను ఆస్పత్రికి తరలించగా... భర్త మృతదేమహం విడిచి రావటానికి నిరాకరించింది. సిబ్బంది అక్కడే రాధకు చికిత్స అందించారు. అనంతరం మెల్లగా నచ్చజెప్పగా... ఆస్పత్రికి వెళ్లేందుకు ఒప్పుకుంది. మొదట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

గూడ్స్​ రైలు ఢీకొని ప్రమాదం... భర్త మృతి, భార్యకు గాయాలు

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

TG_NLG_62_22_TRAINHIT_AV_TS10061 రిపోర్టర్ :సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్ లో గూడ్స్ రైలు భార్య, భర్తలను ఢీ కొట్టటం తో భర్త రాంరెడ్డి మృతి చెందగా, భార్య రాధ కి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరూ జనగాం కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దైవ దర్శనం కోసం యాదగిరిగుట్ట వచ్చి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం కోసం రాయగిరి రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. రైలు కోసం ఎదురుచూస్తూ నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ ఫామ్ పైన అంచున కూర్చొని ఉన్నారు. అదే సమయంలో భువనగిరి నుండి ఆలేరు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొట్టింది. రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, రాధకు చేయి విరిగి తీవ్రంగా గాయపడింది. తన భర్త మృతదేమహం విడిచి రాధ చికిత్సకోసం ఆసుపత్రికి రావడానికి నిరాకరించటం తో 108 సిబ్బంది అక్కడే చికిత్స అందించారు. ఆ తరువాత ఆమెకు నచ్చ చెప్పటం తో మొదట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండటం తో హైదరాబాద్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ కాంతారావు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.