ETV Bharat / state

రేపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ

రేపు యాదగిరిగుట్టలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు సేకరించనున్నారు కాంగ్రెస్​ శ్రేణులు. కేంద్రం తీసుకువచ్చిన అగ్రికల్చర్​ బిల్లును వ్యతిరేకిస్తూ... ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు కాంగ్రెస్​ నాయకులు బీర్ల అయిలయ్య తెలిపారు.

Tomorrow is the collection of signatures under the auspices of MP Komatireddy Venkat Reddy in yadadri

author img

By

Published : Oct 1, 2020, 9:15 PM IST

కేంద్రం తీసుకువచ్చిన అగ్రికల్చర్​ బిల్లును వ్యతిరేకిస్తూ... రేపు యాదగిరిగుట్టలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు సేకరించనున్నారు కాంగ్రెస్​ శ్రేణులు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య తెలిపారు.

సంతకాల సేకరణలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ బిల్లు రైతుల పాలిట శాపంగా మారబోతుందని జోస్యం చెప్పారు.

రైతులకు గుదిబండగా మారనున్న అగ్రికల్చర్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు బీర్ల అయిలయ్య.

ఇదీ చదవండి: సొంత నిధులతో గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చిన ఎంపీటీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.