యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రధానాలయ పునర్నిర్మాణం ప్రపంచ స్థాయిలో జరుగుతుందని టీఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కొనియాడారు. టీఎన్జీవో అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత స్వామివారిని మొదటిసారిగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యాదాద్రి ఆలయం తెలంగాణ తిరుపతిగా మన్నలను పొందడం తథ్యమన్నారు. ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవచేస్తానని హామీ ఇచ్చారు.
![tngo new president visited yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-09-yadadri-tngo-team-visit-ts10134_09102020191237_0910f_1602250957_127.jpg)
![tngo new president visited yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-09-yadadri-tngo-team-visit-ts10134_09102020191237_0910f_1602250957_124.jpg)
ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా అధ్యకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యదర్శుల సహకారంతో కేంద్ర కార్యవర్గానికి తెలియజేస్తూ... తక్షణమే స్పందించి న్యాయంగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన డీఏ, ఐఆర్, పీఆర్సీకి సంబందించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని... నిర్ణయం వారి చేతుల్లో ఉందని తెలియజేశారు. న్యాయపరమైన కోరికలను షరతులు లేకుండా తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
![tngo new president visited yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-09-yadadri-tngo-team-visit-ts10134_09102020191237_0910f_1602250957_960.jpg)