యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నీళ్లు పట్టి అందరినీ ఆకట్టుకున్నారు. పట్టణాలు ఒకేసారి కాకపోయినా... ఎక్కువశాతం అభివృద్ధి సాధిస్తామనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
పట్టణ ప్రగతిలో భాగంగా మురుగు కాలువలు శుభ్రం చేయడం, పాత ఇళ్లు తొలగించడం, చెట్లు నాటడం, వందశాతం వీధి దీపాల ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మోత్కూరు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్, కౌన్సిలర్లకు సూచించారు. పట్టణ ప్రగతిలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. నూతన మున్సిపాలిటీ చట్టంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఇదీ చూడండి : దేశంలో మరో ఆరుగురికి కరోనా