ETV Bharat / state

నిరుద్యోగులకు వరం... ఈ శిక్షణా కేంద్రం - yadadri bhongir

నిరుపేద యువతీయువకులకు ఈ కేంద్రం ఓ వరం. స్వచ్ఛమైన గ్రామీణ ప్రాంతంలో పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అత్యుత్తమ శిక్షణనిస్తూ... రాష్ట్రంలోని నిరుద్యోగులకు బతుకుబాట చూపుతోంది. ఏటా ఆరువేల మందికి ఉపాధి కోర్సులపై ఉచిత వసతి సదుపాయాలతో తర్ఫీదునిస్తూ... ఉద్యోగాలు కల్పిస్తోంది. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తోంది.

నిరుద్యోగులకు వరం... ఈ శిక్షణ కేంద్రం
author img

By

Published : Jul 25, 2019, 1:22 PM IST

Updated : Jul 26, 2019, 6:50 AM IST

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. అలాంటి పల్లె ప్రజల్లో నైపుణ్యాలు మెరుగుపరిచి ఉపాధి పొందేలా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఏర్పాటయింది స్వామీ రామానందతీర్థ గ్రామీణ సంస్థ. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామంలో 1995లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు చేతులమీదుగా ప్రారంభమైంది.

నిరుద్యోగులకు వరం... ఈ శిక్షణ కేంద్రం

భూదాన ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన పోచంపల్లిలో రామానందతీర్థ పేరిట వంద ఎకరాల్లో ఈ సంస్థను నెలకొల్పారు. గ్రామీణ యువతకు మార్గనిర్దేశనం, పరిశోధనలకు ప్రోత్సాహం, మహిళాసాధికారత, నైపుణ్యాభివృద్ధి వంటి లక్ష్యాలు నిర్ధేశించారు. రాష్ట్ర, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచింది. సంస్థ ప్రధాన కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 50 కేంద్రాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి శిక్షణనిచ్చారు. వీరంతా ఉపాధి పొందారు.

ఇక్కడ మొత్తం 15 రకాల కోర్సులపై శిక్షణ ఇస్తారు. మూడు నెలల శిక్షణ అనంతరం ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో పాటు ప్రాంగణ నియామకాలతో ఉపాధి కల్పిస్తారు. ఇక్కడ ప్రవేశం పొందేందుకు సాధారణ విద్యార్హతలు అంటే పదవతరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కొన్ని కోర్సులకు మాత్రం ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. స్వయం ఉపాధితో తమ కాళ్లమీద తాము నిలబడాలనే సంకల్పంతో ఇక్కడ చేరడానికి వచ్చామని విద్యార్థులు చెబుతున్నారు.

ప్రతీ మూడు నెలలకొకసారి జరిగే ప్రవేశాల్లో 500 మంది వరకే హాస్టల్ వసతి ఉంది. వేల మంది చేరేందుకు ముందుకు వస్తున్నా సౌకర్యాలు లేక తిప్పి పంపుతున్నారు.

విశ్వవిద్యాలయ హోదాతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పడు తెలంగాణకు జీవనాడిగా మారింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పించటంలో ముందుంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రెవిన్యూ డివిజన్‌కు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరింత మంది యువతకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి: లోక్​సభలో చర్చకు తలాక్​ బిల్లు- నేడు ఆమోదం!

Last Updated : Jul 26, 2019, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.