ETV Bharat / state

అమ్మ నీది ఎంత పెద్ద మనసు.. - మాతృమూర్తి హృదయం.

నవమాసాలు మోసింది. రక్తాన్ని పాలుగా ఇచ్చింది. కొడుకులు ఏడిస్తే తానూ ఏడ్చింది. కొడుకులు నవ్వితే తానూ నవ్వింది. కొడుకులే ప్రపంచం అనుకుంది. కొడుకుల ఆనందమే తన ఆనందంగా బతికింది. పెంచింది, పెద్ద చేసింది. తన కుమారులకు ఎలాంటి కష్టం రాకూడదని ఆస్తి సంపాదించి ఇచ్చింది. ఎప్పుడూ కొడుకుల క్షేమమే కోరుకుంది. ఇంటి నుంచి గెంటేసినా తన కొడుకులు బాగుండాలని తపిస్తోంది ఆ మాతృమూర్తి హృదయం. ఐదు రోజులుగా చెట్టు కిందే  అభాగ్యురాలిగా జీవిస్తోంది ఆ తల్లి.

లక్షమ్మ
author img

By

Published : Sep 14, 2019, 4:32 PM IST

అమ్మ నీది ఎంత పెద్ద మనసు..
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తి రెడ్డిగూడెంలో ఆనంతుల లక్షమ్మ అనే 84 ఏళ్ల వృద్ధురాలిని కొడుకులు ఇంటి నుంచి గెంటేశారు. 70 ఎకరాల ఆస్తి ఇచ్చిన అమ్మను అనాథగా వదిలేశారు. పుట్టినప్పటి నుంచి కొడుకులను కంటికి రెప్పలా కాపాడిన తల్లిని ఆ పుత్రులే నడిరోడ్డుపై వదిలేసిన ఘటన అందరినీ కంట తడి పెట్టిస్తోంది. నవమాసాలు మోసిన ఆ మాతృమూర్తిని నెల కూడా మోయలేని కసాయి కుమారులు బయటకు గెంటేశారు. ఐదు రోజులుగా చెట్టు కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ఆ తల్లి.

ఒక్క మాట కూడా

లక్షమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు పిల్లల వద్దే ఉంటూ ఇంటి పనిచేసింది. ఆ తర్వాత కుమారులు నెలకు ఒక్కరు పోషించేలా పెద్దలు ఒప్పందం చేశారు. నాలుగు రోజులు క్రితం రెండో కొడుకు భార్య.. అత్త లక్షమ్మను ఇంటి నుంచి గెంటేసింది. అప్పటి నుంచి ఒక చెట్టు నీడన ఆశ్రయం పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మమ్మ కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామస్థులు కొడకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా... కుమారులను ఒక్క మాట అనకుండా మాతృమూర్తి మనసు చాటుకుంది లక్ష్మమ్మ.

ఇవీ చూడండి: అత్త పాడె మోసిన నలుగురు కోడళ్లు!

Intro:Tg_nlg_185_14_vrudhu_ralu_av_TS10134
యాదాద్రి భువనగిరి....
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630..

యాంకర్ వాయిస్:అమ్మ ను మించిన దైవం లేదు అంటారు..కానీ అలస్యముగా వెలుగులోకి వచ్చిన విషయం .కానీ అమ్మ కు అన్నం పెట్టలేక ఆస్తి మొత్తం తీసుకొని ఇంట్లో నుంచి బయటకు గెటివేసిన కొడుకుల వైనం మోట కొండూరు,మండలం ముత్తిరెడ్డి గూడెం లో చోటుచేసుకుంది...

వాయిస్ ఓవర్:యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలంలోని ముత్తి రెడ్డి గూడెం గ్రామంలో ఆనంతుల లక్షమ్మ అనే వృద్దురాలు ఎనబై ఏండ్ల వయస్సులో ఇంటి నుంచి గెట్టేసిన కొడుకులు. పుట్టినప్పుటి నుంచి కొడుకులను కంటికి రెప్పలా కాపాడిన అమ్మను ఆ పుత్రులే నడి రోడ్డు పై వదిలేసిన సంఘటన అందరినీ కంట తడి పెట్టింస్తుంది.తల్లి సంపాదించిన 70 ఎక్కరాల ఆస్తిని పంచుకున్న కొడుకులు బయటకు గెంటేయడంతో ఆ మాతృమూర్తి ఐదు రోజులుగా చెట్టు క్రింద బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది.లక్షమ్మ కు ముగ్గురు కొడుకులు, ఒక కుమారైలు ఉన్నారు.పాతికేళ్ళ క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు క్రితం పిల్లలకు పనిచేసింది.ఆ తర్వాత కుమారులు నెలకు ఒక్కరు పోషిoచేలా పెద్దల ఒప్పందం చేశారు.అయితే నాలుగు రోజులుగా రెండవ కొడుకు భార్య అత్త లక్షమ్మ ను ఇంటి నుంచి గెంటేసింది అప్పటి నుంచి ఒక చెట్టు నీడన ఆశ్రమం పొందుతుంది.విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మమ్మ కుమారులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు ఒకప్పుడు ఒక మహారాణి లా వెలుగు వెలిగిన లక్షమ్మ ను ఇంట్లో నుంచి గెంటి వేయడంతో గ్రామస్తులు ఇలాంటి కొడుకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బైట్..స్థానికులు...

Body:Tg_nlg_185_14_vrudhu_ralu_av_TS10134Conclusion:Tg_nlg_185_14_vrudhu_ralu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.