కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యా విధానం సామాన్యులకు చదువును దూరం చేసేదిగా ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య అన్నారు. "సేవ్ ఇండియా డే" సత్యాగ్రహం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు టీఎస్ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే దేశాభివృద్ధికి.. సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రైవేటీకరణ వల్ల పెట్టుబడిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటాచారి, ఉప్పలయ్య, జిల్లా నాయకులు సోమేశ్వర్, ఉపాధ్యాయులు నరేశ్, శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ, భాస్కరాచారి, బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.