ETV Bharat / state

యాదాద్రిలో రూపుదిద్దుకుంటున్న అద్దాల మండపం - యాదాద్రిలో సాగుతోన్న ఆలయ పనులు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో మండప నిర్మాణం ఆగిపోయింది. మరికొన్ని రోజుల్లో మండప నిర్మాణం మొదలు కానుంది.

యాదాద్రిలో రూపుదిద్దుకుంటున్న అద్దాల మండపం

author img

By

Published : Sep 1, 2020, 5:14 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మాణం చేపడుతున్న ప్రధానాలయంలో అద్దాల మండపం రూపుదిద్దుకోనుంది. అమ్మవారి సేవోత్సవాలలోపు భక్తులకు కనువిందు గొలిపే తీరులో మండపం సిద్ధం కానుంది. నిపుణుల ద్వారా అద్దాల బిగింపు, స్వామివారి అమ్మవార్ల చిత్రాలను పొందు పరచనున్నారు. ఈ మేరకు పనులను చేపట్టారు.

ఇటీవల కురిసిన వర్షాలతో మండప నిర్మాణం ఆగిపోయింది. మరికొన్ని రోజుల్లో మండప నిర్మాణం మొదలు కానుంది. అద్దాల మండపం పూర్తయ్యాక భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేయనున్నారు. తాజాగా అద్దాల మండపం నమూనా.. వీడియోను మీడియాకు విడుదల చేశారు. హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఇంద్రసేనారెడ్డి అద్దాల మండపానికి రూ. రెండు కోట్లు విరాళం ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.