ETV Bharat / state

ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్న సీఎం - March 4th kcr visit yadadri temple

ఈ నెల 4న సీఎం కేసీఆర్​ యాదాద్రిని సందర్శించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్న సీఎం... యాదాద్రిలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త హంగులను గమనించనున్నారు. మాడవీధుల్లో సౌకర్యాల కల్పనకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు.

The CM KCR will visit Yadadri on the 4th march 2020
ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్న సీఎం
author img

By

Published : Mar 2, 2021, 5:53 AM IST

సీఎం కేసీఆర్‌ ఈ నెల 4న యాదాద్రి క్షేత్రసందర్శనకు వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. సీఎం వచ్చేసరికి ఆలయాన్ని సంప్రదాయ హంగులతో రూపొందించేందుకు యాడా పనుల్లో వేగం పెంచింది. మాడవీధుల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఆలయ కనుమ దారులను మెరుగుపరిచేందుకు రోడ్లు, భవనాలశాఖ నడుం బిగించింది. పాత కనుమదారి విస్తరణ ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దారి వెంట మినీ పార్కులను ఏర్పాటు చేశారు. కొండపైన ఆలయ సమీపంలో స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. ప్రధానాలయానికి ఉత్తరాన మొక్కలు, పచ్చిక బయళ్లతో ప్రాంగణాన్ని హరితమయం చేస్తున్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కరోనా మొదటి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.