Temples opened after the solar eclipse: సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నిన్న మూసివేసిన ప్రధాన ఆలయాలు అన్ని ఈరోజు తెరుచుకున్నాయి. నిన్న ఉదయం 8.50 నిమిషాలకు మూసిన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయాన్ని ఈరోజు ఉదయం 8 గంటలకు తెరిచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
సుప్రభాతం, సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకళాశాభిషేకం, ఆరాధన, బాలభోగం, నివేదన, చాత్మర లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం భక్తులను ప్రవేశపెట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం తెరిచి ద్వారాలన్నీ ఆలయ అర్చకులు శాస్త్రీయంగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి తెరిచారు.
ప్రథమంగా గణపతి పూజ, ఆదిత్య నవగ్రహ ఆరాధన, కలిశారాధన, తాంబూలాలు, మామిడాకులు, పసుపు కుంకుమ, అక్షింతలు, దక్షిణ తాంబూలాలచే మొదలగు విశేషంగా పుణ్య వాచిన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం 9గంటల నుంచి భక్తులకు దర్శనానికి అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా భద్రాద్రి రామయ్య ఆలయం మంగళవారం రాత్రి 7గంటలకు తెరిచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.