Akhanda team at Yadadri: దేశం గర్వించే స్థాయిలో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన సీఎం కేసీఆర్కు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణశిలతో ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పులకు, ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉదయం అఖండ చిత్రబృందంతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న బాలయ్య.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని పరిశీలించారు.
మహాద్భుతం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని చూస్తుంటే మహాద్భుతంలాగా అనిపిస్తోంది. తిరుపతికి దీటుగా.. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, దృఢ సంకల్పంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. దేశ వ్యాప్తంగా ప్రజలు దర్శించుకునేలా ఆలయ వైభవం ఉంది. ఇందులో భాగమైన, శిల్పులు, రాళ్లెత్తిన వారికి, పనిచేసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. -నందమూరి బాలకృష్ణ, సినీ నటుడు
BalaKrishna At Yadadri : యాదాద్రి నిర్మాణం సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనమని బాలకృష్ణ అన్నారు. తన ఇష్ట దైవం లక్ష్మీ నరసింహ స్వామి అని.. చిన్నతనం నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి : Bandi Sanjay UnEmployment Strike : బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ప్రారంభం