Yadadri golden chariot: యాదాద్రి ఆలయ దివ్యరథాన్ని స్వర్ణమయం చేసే కార్యక్రమం ముగిసింది. దివ్యవిమాన రథంపై కవచాలను బిగించి రథాన్ని సిద్ధం చేశారు.
చెన్నై నుంచి కవచాలు..
పంచనారసింహుల దివ్య సన్నిధానంలో, యాదాద్రి ఆలయ దివ్యరథాన్ని స్వర్ణమయంగా మార్చేందుకు చెన్నై నుంచి బంగారు కవచాలు 2 రోజుల క్రితం ఆలయానికి వచ్చాయి. దాతల సహకారంతో హైదరాబాద్లోని శ్రీలోగిళ్లు, లాండ్మార్క్కు చెందిన ఎండీలు ఈ ఆలయానికి చెందిన టేకు రథాన్ని స్వర్ణ రథంగా రూపొందించేందుకు ముందుకొచ్చాయి. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ నిపుణులు తయారుచేసిన కవచాలకు ఇటీవల పూజలు నిర్వహించి బిగింపు పనులు పూర్తిచేశారు.
ఆకట్టుకుంటున్న స్వర్ణరథం..
దివ్యవిమాన రథంపై కవచాలను బిగించి రథాన్ని సిద్ధంగా ఉంచారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 7 గంటలకు బాలాలయంలో నిర్వహించే దివ్యవిమాన రథోత్సవ వేడుక కార్యక్రమంలో స్వామివారిని ఈ స్వర్ణరథంలో వైభవంగా ఊరేగించనున్నారు. ఈ స్వర్ణరథం ఆలయంలో భక్తులను, చూపరులను ఆకట్టుకుంటుంది.
ఇదీ చదవండి:Yadadri Lakshmi Narasimha Swamy Kalyanam: కన్నులపండువగ యాదాద్రీశుల తిరుకల్యాణం