యాదాద్రి(Yadadri News) ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా పాతగుట్ట చౌరస్తా వద్ద పాత రోడ్లు తవ్వి కాంక్రీట్ వేశారు. దీనివల్ల తాము వ్యాపారం చేసుకోవడానికి వీల్లేకుండా పోయిందని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్ష నాయకులతో కలిసి పాతగుట్ట వద్ద బైఠాయించారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేశారు.
ఇప్పటికే పట్టణంలో నిర్మించిన రోడ్ల వల్ల దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారని అఖిలపక్ష నేతలు తెలిపారు. యాదాద్రి భక్తుల ద్వారా చిరువ్యాపారులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టడం సబబు కాదని అన్నారు. వీధి వ్యాపారులకు న్యాయం జరిగేలా చూడాలని.. వారు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.
"యాదాద్రిలో చిరువ్యాపారలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణలో అధికారులు తప్పుడు నివేదికలతో రహదారులు విస్తరిస్తూ తమ వ్యాపారం సాగకుండా చేస్తున్నారు. దీనివల్ల మేం జీవనోపాధి కోల్పోతున్నాం. వీలైనంత త్వరగా ఉన్నతాధికారులు స్పందించి.. తమకు న్యాయం జరిగేలా చూడాలి."
- వీధి వ్యాపారి
- ఇదీ చదవండి : ఆపరేషన్ పోలోకు ముందే తెరవెనక యుద్ధం!