యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేట్స్ ఎన్హెచ్ఎం విభాగం ప్రిసిల్లా చంద్రన్, ఎస్డీఎమ్ మానస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి... కొవిడ్-19 రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కరోనా కట్టడికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు... రోగులకోసం అందుబాటులో ఉంచిన సామగ్రి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. కరోనా రోగులకు చికిత్స విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆరోగ్య సిబ్బందికి వివరించారు. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంతమందికి పాజిటివ్ కేసులు వచ్చాయి.. మరణాల రేటు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో అందించిన ఇతర వైద్య సేవల వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ రాజేందర్, డాక్టర్ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్