యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని శేరిగూడెంలో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. గుర్తులు తారుమారయ్యాయని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రీపొలింగ్ నిర్వహించాలంటూ రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిలిచిపోయింది. గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు గోవింద్ సింగ్ స్వతంత్ర అభ్యర్థలతో చర్చలు జరిపారు. ఉదయం ఓటు వేసిన 16 మందికి మళ్లీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని కమిషనర్ నచ్చజెప్పారు. గుర్తుల తారుమారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి ఒప్పుకున్న అభ్యర్థులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం పోలింగ్ తిరిగి మొదలైంది.
ఇవీ చూడండి: 'ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..!'