ETV Bharat / state

చరిత్రను చూపే బాట.. భువనగిరి కోటకు వైభవం ఇంకెప్పుడు?

భువనగిరి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఒక్కటి కూడా ముందుకు సాగడం లేదు. ప్రజా ప్రతినిధులు హామీలిచ్చినప్పటికీ.. ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. భువనగిరి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గతంలో ప్రభుత్వం 16.50 కోట్ల రూపాయల నిధుల అంచనా వ్యయంతో కోట వద్ద మౌలిక సదుపాయాలు, నిర్మాణాలతో పాటు తీగ మార్గం(రోప్​ వే) నిర్మించాలని ప్రతిపాదించారు.

BHONGIR FORT
చరిత్రను చూపే బాట.. భువనగిరి కోటకు వైభవం ఇంకెప్పుడు?
author img

By

Published : Dec 3, 2020, 12:34 PM IST

Updated : Dec 3, 2020, 4:00 PM IST

భువనగిరి కోటను రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉంది. దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే.. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అంతర్జాలంలో చూసి.. ప్రత్యేకంగా చూసేందుకు వస్తున్నారు. కోట అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం గతంలో 16.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మాత్రం విడుదల కాలేదు. ఈ అంచనా వ్యయంతో రెస్టారెంట్​, మరుగుదొడ్లు, చిన్నారుల కోసం పార్కులు, పాత్​ వేలు నిర్మించాలని ప్రతిపాదించారు.

దాదాపు 95వేల ఆదాయం

భువనగిరి కోట నిర్వాహణ కోసం పూర్తి స్థాయి సిబ్బందిని నియమించలేదు. ఉన్న ఒక్క చౌకీదార్​ వీఆర్​ఎస్​ తీసుకోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్​లు మాత్రమే మిగిలారు. వీరు కూడా ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో నియమించారు. వీరే సందర్శకులకు టికెట్లు ఇస్తున్నారు. వీరికి ఐదు నెలల నుంచి జీతాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కోట సందర్శించే పర్యాటకుల నుంచి నెలకు దాదాపు 40వేల రూపాయల నుంచి 95వేల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది.

కోట వద్ద రోప్​వే

భువనగిరి కోట వద్ద 2013లో తీగ మార్గాన్ని (రోప్​వే) ప్రతిపాదించారు. నిర్మాణానికి బైపాస్​ రోడ్డు సమీపంలో 2.36 ఎకరాల భూమిని సేకరించి.. అక్కడ బేస్​ స్టేషన్​ ఏర్పాటు కోసం.. కంచెను ఏర్పాటు చేశారు. తదుపరి అవసరాల కోసం మరో రెండు ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. తీగ మార్గం నిర్మాణం చేపట్టేందుకు గతంలో కోల్​కత్తాకు చెందిన రోప్ వే రిసార్ట్ అనే సంస్థ ముందుకు వచ్చింది. అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

ఉపాధి అవకాశాలు

కేేఎస్​ఆర్ సంస్థ సాయిల్ టెస్టింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత పనులు కార్యరూపం దాల్చలేదు. భువనగిరి తీగ మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రాంతం మూడు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో తీగ మార్గం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

ఇంకెప్పుడు?

తెలంగాణ రాష్ట్రంలో తీగ మార్గం (రోప్ వే) ఉన్న పర్యాటక కేంద్రం ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. భువనగిరి కోట రాష్ట్ర రాజధాని అతి సమీపంలో ఉండడంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి భారీగా వచ్చే అవకాశం ఉంది. రాక్ క్లయింబింగ్ స్కూల్ ఇప్పటికే విజయవంతంగా నడుస్తుంది. రోప్ వే సదుపాయం ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. యాదాద్రి పునరుద్ధరణ పనులు

Last Updated : Dec 3, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.