ETV Bharat / state

మున్సిపాలిటీగా మారినా... మారని తలరాతలు - మారని తలరాతలు

ఎక్కడ చూసినా ఈగలు, దోమలు, పందులే. రహదారుల్నీ గుంతలమయమే. ఇవి చాలవన్నట్లు ఆ రోడ్లపై మురుగు నీరు. ముక్కు మూసుకోకపోతే రోడ్డుపై నడవలేని పరిస్థితి. ఇది ఏ పల్లెటూర్లోనో కాదు... యాదాద్రి భువనగిరి జిల్లాలలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో. మున్సిపాలిటీ పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక గ్రామాలు, పల్లెలు, తండాల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మున్సిపాలిటీగా మారినా... మారని తలరాతలు
author img

By

Published : Sep 1, 2019, 9:26 PM IST

మున్సిపాలిటీగా మారినా... మారని తలరాతలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది, నిధుల కొరతతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. ప్రయాణ ప్రాంగణం, తంగడపల్లి రోడ్డు, రాంనగర్ ప్రాంతాల్లో మురుగు నీరు ఏరులై పారుతోంది. బీసీ వసతి గృహం పక్కన పట్టణంలోని మురుగు నీరు చేరి విపరీతమైన దుర్వాసన వస్తూ... విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు మెర పెట్టుకున్నా డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

డంపింగ్ యార్డు కూడా లేదు..

వర్షాకాలం కావడం వల్ల ఎక్కడికక్కడ నీరంతా నిలిచిపోయి దోమలకు అడ్డాగా మారిపోతోంది. దీనితో ప్రజలు డెంగీ, మలేరియా, టైపాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారు. డంపింగ్ ​యార్డు లేకపోవడం వల్ల నివాసాల మధ్యే చెత్త పడేస్తున్నారు. వీటి వల్ల చెత్తకుప్పల దగ్గరకి పందులు చేరుతూ హంగామా చేస్తున్నాయి. మిషన్ భగీరథ పనులతో సీసీ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. చౌటుప్పల్ చెరువు కట్టపై మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైంది.

ఉపాధి హామీ దూరం

చౌటుప్పల్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు తంగడపల్లి, తాళ్లసింగారం, లక్కారం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉండేది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం వల్ల "ఉపాధి" లేదు. వారికి ఇష్టం లేకున్నా విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు దూరమై రోజువారి కూలి చేసుకునే నిరుపేదలకు... బతుకు భారంగా మారింది.

మున్సిపాలిటీ అధికారులు కేవలం పన్నుల వసూళ్లకే పరిమితమయ్యారని, పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి దూరంగా డంపింగ్ యాడ్​ను ఏర్పాటు చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నామని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి చెబుతున్నారు.

ఇవీ చూడండి: గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ భేటీ..

Intro:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.

Body:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.

Conclusion:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.