యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని శివ బాలాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత గణపతి పూజ పుణ్యాహవాచనం, అంకురార్పణ, కలశ స్థాపన, పంచగవ్య ప్రాశనం, రుత్విక్ వరుణం మొదలగు పూజలతో నవరాత్రులకు శ్రీకారం చుట్టారు.
రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. మూడో రోజు గాయత్రి దేవి, నాలుగో రోజు అన్నపూర్ణ దేవి, ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవి, ఆరో రోజు మహాలక్ష్మి, ఏడో రోజు సరస్వతి దేవి మూలా నక్షత్రం, ఎనిమిదో రోజు దుర్గాదేవి దుర్గాష్టమి, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని, పదో రోజు దసరాను పురస్కరించుకుని రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నరసింహమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కరోనా నిబంధనలతో బతుకమ్మ సంబురాలు