ETV Bharat / state

GOVERNMENT SCHOOLS: గడువు తరుముకొస్తోంది... బడి అగమ్యగోచరంగా దర్శనమిస్తోంది!

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు తగిన వసతులు కల్పించాలని సూచించింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని అనేక పాఠశాలల్లో సమస్యలు తిష్ట వేశాయి. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి అవస్థలు తప్పేలా లేదు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్ని చోట్ల పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్ర శాలలు అధ్వాన్నంగా మారాయి. నీటి సరఫరా, స్కావెంజర్ లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అగమ్యగోచరంగా మారనుంది.

government schools
ప్రభుత్వ పాఠశాలలు
author img

By

Published : Aug 29, 2021, 7:30 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.. మందుబాబులకు నిలయంగా మారింది‌. సాయంత్రం కాగానే మందుబాబులు అక్కడికి చేరుతున్నారు. కొవిడ్​ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పక్కనే ఉన్న నివాసితులు భయాందోళన చెందుతున్నారు. తరగతి గదుల తలుపులు విరగ్గొట్టి మద్యం సేవించడమే కాకుండా.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటి ద్వారా విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నిర్వహణాలేమి

మరోవైపు పాఠశాలల పాత గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్టతో పాటు, బొమ్మల రామారం, తుర్కపల్లి, మోటకొండూర్​ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పాఠశాలల ఆవరణల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అంతే కాకుండా నిర్వహణాలేమితో దుర్గంధం వెదజల్లుతోందని.. దీని ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ఆస్కారముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరినట్లుగా ఉన్న తరగతి గదులు, పగిలిన ఫ్లోరింగ్​ బండలు విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. పాఠశాలల ఆవరణల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, ఆకతాయిల చేష్టలకు తెగిన విద్యుత్​ కనెక్షన్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పారిశుద్ధ్య, మరమ్మతు చర్యలపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

మౌలిక వసతుల లేమితో ప్రభుత్వ పాఠశాలలు

యాదగిరి గుట్టలోని ప్రభుత్వ పాఠశాలలో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. తరగతి గదుల్లోకి చేరి మద్యం సేవిస్తున్నారు. అంతే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలి. -స్థానికుడు, యాదగిరి గుట్ట

ఇక్కడి పాఠశాలలు దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాగునీటి సదుపాయం లేదు. ఫ్లోరింగ్​ బండలు పగిలిపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చుకోవడానికి ఇబ్బందులు తప్పదు. జిల్లా కలెక్టర్​ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి. - స్థానికుడు, యాదగిరి గుట్ట

పాఠశాలలా.. మురికి కూపాలా.?

అదేవిధంగా తుర్కపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, అపరిశుభ్ర పరిసరాలు, శిథిలావస్థలో మరుగుదొడ్లు, తాగునీటి కొరత.. విద్యార్థులను వేధిస్తున్నాయి. కరోనా ఏమో కాని.. వీటి ద్వారానే పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సెప్టెంబరు 1నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభంతో ఈ నెల 30లోగా అన్ని శుభ్రతా చర్యలు పూర్తవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థలు.. పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేశాయి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: BANDI SANJAY: 'పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.