యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలోని సిబ్బంది కరోనా బారిన పడుతూనే ఉన్నారు. యాదగిరిగుట్టలో ఐదురోజుల్లో 118 మందికి కరోనా సోకగా... అందులో ఆలయ సిబ్బంది 73 మంది ఉన్నారు. ఆలయంలో మూడు రోజులుగా ఆర్జిత సేవలు నిలిపివేసినా... కేసులు పెరుగుతూనే ఉన్నాయని... తెలిపారు. రేపటి నుంచి ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగనున్నందున కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
శానిటైజ్ చేసి..
కరోనా నియంత్రణ కోసం.. ఆలయాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను అధికారులు శానిటైజ్ చేయించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు, దుకాణదారులు రెండురోజుల పాటు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో కరోనా విజృంభణ.. బీ అలర్ట్'