ETV Bharat / state

లాక్ డౌనే అదును... తంగడిపల్లి చెరువులో ఇసుక మాఫియా - CHOUTUPPA

లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అధికారులు కరోనా కట్టడిలో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా భావించిన ఇసుక మాఫియా... యథేచ్ఛగా భూగర్భ సారాన్ని దోచేస్తోంది.

ఇసుక దంద... 4 ట్రాక్టర్ల అరెస్ట్
ఇసుక దంద... 4 ట్రాక్టర్ల అరెస్ట్
author img

By

Published : Apr 27, 2020, 2:45 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడిపల్లి చెరువు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్​లపై కేసులు నమోదు చేశారు. గతంలో కూడా తంగడిపల్లి చెరువు నుంచి అనేక సార్లు అక్రమంగా ఇసుక తరలించారని గ్రామస్థులు తెలిపారు. యంత్రాంగమంతా లాక్ డౌన్​ అమల్లో ఉండగా ఇసుక బకాసురులు పేట్రేగిపోతున్నట్లు పేర్కొన్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి...

వాగుల్లో ఇసుకకు డీడీలు నిలిపివేయడం వల్ల మాఫియా చెరువు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అధిక రేట్లకు అమ్ముతూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గత వర్షకాలంలో అధిక వానలు పడినప్పటికీ చెరువులో నీరు ఉండట్లేదని గ్రామస్థులు అంటున్నారు. తంగడిపల్లి చెరువు 4 గ్రామాల పరిధిలో ఉండటం వల్ల ఏ గ్రామం నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయనే విషయాన్ని అధికారులు గమనించలేకపోతున్నారు. ఇసుక మాఫియాకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపించి, తంగడిపల్లి చెరువును కాపాడాలని రెవెన్యూ, పోలీసు అధికారులును కోరుతున్నారు.

ఇవీ చూడండి : సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.