ETV Bharat / state

కాల్వపల్లిలో ఘనంగా సదర్​ ఉత్సవాలు

author img

By

Published : Oct 29, 2019, 3:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​(ఎం) మండలం కాల్వపల్లిలో సదర్​ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

యాదాద్రిలో సదర్​ ఉత్సవాలు
యాదాద్రిలో సదర్​ ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​(ఎం) మండలం కాల్వపల్లిలో సదర్​ సంబురాలు అంబరాన్నంటాయి. డప్పు చప్పుళ్లు, మంగళ వాద్యాల మధ్య ఆటపాటలతో దున్నపోతును ఊరేగించారు. తెలంగాణ సంప్రదాయంలో భాగంగా సదర్​ ఉత్సవాలు శ్రీకృష్ణుని వంశమైన యాదవులు జరపడం ఆనవాయితీగా వస్తోందని యాదవ సంఘం సభ్యులు అన్నారు. ఆ వసుదేవుడి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

యాదాద్రిలో సదర్​ ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​(ఎం) మండలం కాల్వపల్లిలో సదర్​ సంబురాలు అంబరాన్నంటాయి. డప్పు చప్పుళ్లు, మంగళ వాద్యాల మధ్య ఆటపాటలతో దున్నపోతును ఊరేగించారు. తెలంగాణ సంప్రదాయంలో భాగంగా సదర్​ ఉత్సవాలు శ్రీకృష్ణుని వంశమైన యాదవులు జరపడం ఆనవాయితీగా వస్తోందని యాదవ సంఘం సభ్యులు అన్నారు. ఆ వసుదేవుడి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryspet.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం కాల్వపల్లి గ్రామంలో నిన్న రాత్రి సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
మొదలుగా గ్రామంలో ని పెండ్లి రాములు కుటుంబ సభ్యులు మరియు గ్రామ యూత్ సభ్యులు నిర్వహించారు.
పెండ్లి రాములు తమ ఇంటి నుంచి శ్రీకృష్ణుని ప్రతిమతో డప్పు చప్పుళ్ళతొ మంగళ వాయిద్యాలతో సదరు దున్నపోతును ఆట పాటలతో ఊరేగింపు నిర్వహించి గ్రామ కచ్చీరు వద్ద ఉత్సవాలను నిర్వహించారు.
తెలంగాణ సాంప్రదాయం లో భాగం సదర్ ఉత్సవాలు శ్రీకృష్ణుని వంశస్తులు అయినట్టి యాదవులు పూర్వకాలంలో పాడి పశువులను పెద్ద సంఖ్యలో పెంచుకొని పాలు, పెరుగు సమృద్ధిగా ఉత్పత్తి చేసే వారని మారుతున్న రోజులలో పాడి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, నేడు మనం పాడికోసం పశు సంపద ను పెంపొందించు కోవాలని ఉద్దేశ్యంతో హైదరాబాదులో నిర్వహించే సదరు ఉత్సవాలను నిర్వహిస్థున్నారని , నేడు గ్రామాలలో ఈ ఉత్సవాలు విస్తరించడం సంతోషదాయకం అని అందరూ కూడా శ్రీకృష్ణుని ఆశీర్వాదాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మొదటిసారిగా సదరు వేడుకలను నిర్వహించిన గ్రామ ప్రజా ప్రతినిధులను యువతను అభినందించారు.
ఈ ఉత్సవాలకు ముర్ర జాతికి చెందిన దున్నపోతులను హైదరాబాద్ బోయిన్పల్లి నుండి తీసుకొచ్చారు.
ఈ దున్నపోతులను రోజుకు అద్దె 45000/-₹ అద్దె చెల్లించి గ్రామానికి తీసుకొచ్చి ఉత్సవాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య, స్థానిక ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, వైస్ ఎంపీపీ భాషబోయిన పద్మ పాపయ్య, ఆత్మకూరు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు భాషబోయిన ఉప్పలయ్య , నిర్వాహకులు పెండ్లి మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.