యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎటు చూసినా మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
అధికారులు ఆంక్షలు విధించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండో దశలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోందని.. లాక్డౌన్ విధిస్తే.. మద్యంప్రియులు మాత్రం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.