ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్​ నిర్లక్ష్యం... త్రుటిలో తప్పిన ప్రమాదం

లారీని దాటేసేందుకు ప్రయత్నించి కారుపైకి దూసుకెళ్లి ఢీకొట్టాడు. కారును తప్పించేందుకు పక్కకు తిప్పగా... అటు లారీని కూడా ఢీకొట్టాడు. ఇదంతా ఏదో ద్విచక్రవాహనదారుడు చేసిన పని కాదండోయ్​. నిండా ప్రయాణికులను పెట్టుకుని ఓ ఆర్టీసీ డ్రైవర్​ చేసిన ఘనకార్యం.

author img

By

Published : Mar 1, 2020, 12:26 PM IST

RTC BUS COLLIDE WITH CAR AND LORRY AT VALIGONDA MUSI BRIDGE

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని మూసీ వంతెన వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న లారీని దాటేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అదే సమయంలో బస్సు డ్రైవర్ ఎడమవైపు తిప్పటం వల్ల లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు, కారు, లారీ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.

ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ఉన్న ప్రయాణికులు బస్సు డ్రైవర్​పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని ట్రాఫిక్​ని పునరుద్ధరించారు. ఆర్టీసీ బస్సును పోలీస్​స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఆర్టీసీ డ్రైవర్​ నిర్లక్ష్యం... త్రుటిలో తప్పిన ప్రమాదం

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.