ETV Bharat / state

ఆహ్లదకరంగా యాదాద్రి రహదారులు.. - FLOWERS ON HIGHWAY

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు 'యాడా' పనిచేస్తోంది. ఈ మేరకు రహదారులపై మెుక్కలు నాటుతూ మినీ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.

ఆహ్లాదకరంగా యాదగిరిగుట్ట రోడ్లు
ఆహ్లాదకరంగా యాదగిరిగుట్ట రోడ్లు
author img

By

Published : Mar 13, 2020, 4:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి దేవస్థానానికి వచ్చే యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. భక్తులు, పర్యటకులు, చూపరులను కట్టిపడేయాలన్నదే 'యాడా' ఆశయమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రణాళిక ఆధారంగా జీహెచ్ఎంసీ, ఆర్అండ్​బీ పర్యవేక్షణలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు సుమారు 5 కిమీ మేర దారిని వెడల్పు చేశారు. ఇరువైపుల పాదచారులకు ప్రత్యేక దారిని పచ్చిక బయళ్లతో ఏర్పరిచారు. రకరకాల పూల చెట్లతో ఆకర్షణీయమైన మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు సేద తీరేందుకు మినీ పార్కులూ సిద్ధం చేశారు. రహదారి పొడవునా పూల మొక్కలు, పచ్చిక బయళ్ల నిర్వహణను యాదాద్రి దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ చేపడుతోంది.

ఇవీ చూడండి : స్తంభించిన ట్రాఫిక్... ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.