ETV Bharat / state

రోడ్డుభద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - యాదాద్రి భువనగిరి జిల్లా

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా భువనగిరి పట్టణంలో రవాణాశాఖాధికారి సురేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో వాహన చోదకులకు శిరస్త్రాణాలు పంపిణీ చేశారు.

road safety varostav in yadadri
రోడ్డుభద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ల పంపిణీ
author img

By

Published : Jan 29, 2020, 6:33 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆర్టీవో అధికారులు నిర్వహించారు. స్థానిక హైదరాబాద్ చౌరస్తాలో జిల్లా రవాణాశాఖ అధికారి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భద్రతా వారోత్సవాల్లో భాగంగా భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహన దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సురేందర్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కారు డ్రైవింగ్ సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఓవర్ లోడ్​తో ప్రయాణించండం, మద్యం సేవించి వాహనాలను నడపటం నేరమని.. వారికి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.

రోడ్డుభద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ల పంపిణీ

ఇదీ చూడండి: వాగ్దానాలు మరిచిన 'మంత్రిని నిలదీసిన మహిళ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.