యాదాద్రి భునగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపూర్ గ్రామ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను రాజపేటకు చెందిన గొల్లపల్లి కనకయ్య, రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామానికి చెందిన వలిగొండ సతీష్‌గా గుర్తించారు. సతీష్ జగదేవ్‌పూర్ నుంచి తుర్కపల్లి మీదుగా రాజపేటకు బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న క్రమంలో కారు టైరు పేలి.. కారు అదుపు తప్పింది. అదే సమయంలో ద్విచక్రవాహనం మీద వస్తున్న కనకయ్యను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:మాస్క్‌తో మార్నింగ్ వాక్.. చాలా డేంజర్!