ETV Bharat / state

Mariyamma: మరియమ్మ శవానికి రీపోస్టుమార్టం నిర్వహించాలి - Telangana news

అడ్డగుడూరు పోలీస్​స్టేషన్​లో దొంగతనం కేసులో అరెస్టయి పోలీసుల చిత్రహింసలతో మృతి చెందిన మరియమ్మకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య.

Repostmortem
మరియమ్మ
author img

By

Published : Jun 24, 2021, 9:22 PM IST

పోలీసుల చేతిలో చిత్ర హింసలకు గురై మృతిచెందిన మరియమ్మ శవానికి రీపోస్టుమార్టం నిర్వహించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పోలీస్​స్టేషన్​లో దొంగతనం కేసులో అరెస్టయి పోలీసుల చిత్రహింసలతో మరియమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే.

మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సంధ్య పేర్కొన్నారు. తన బృందంతో అడ్డగుడూరు పోలీస్​ స్టేషన్, గోవిందాపురం చర్చి ఫాదర్​ను కలిసి నిజనిర్ధరణ జరిపారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పీఓడబ్ల్యూ (POW), ఏఐకేఎంఎస్ (AIKMS), ఐఎఫ్​టీయూ (IFTU), పీడీఎస్​(PDSU), పీవైఎల్ (PYL) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

మరియమ్మ మృతికి కారణమైన పోలీసులను, చర్చి ఫాదర్​ను కఠినంగా శిక్షించాలి. మృతురాలి కుటుంబానికి పరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మరియమ్మ కేసు పలు అనుమాలకు తావిస్తోంది. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

-- సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్

రూ. 2 లక్షల దొంగతనం కేసులో పోలీసులు ఎందుకింత ఉత్సాహం ప్రదర్శించారని సంధ్య ప్రశ్నించారు. మరియమ్మ మరణం వెనుక సస్పెండ్ అయిన ఎస్ఐ, ఇద్దరు పోలీసుల కాక మరో ఇద్దరు పోలీసులు ఉన్నారని ఆరోపించారు. వారిని కూడా సస్పెండ్ చేసి బాధ్యులైన ఐదుగురు పోలీసులు, చర్చి ఫాదర్​పై కేసు నమోదు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు భిక్షపతి, ఐఎఫ్ టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Mariyamma: మరియమ్మ శవానికి రీపోస్టుమార్టం నిర్వహించాలి

ఇదీ చదవండి: Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.